తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను
మీకా 7:6

కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు , ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.

జెకర్యా 13:2-6
2

ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు -ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండ దేశము లోనుండి నేను వాటిని కొట్టివేతును ; మరియు ప్రవక్తలను అపవి త్రాత్మను దేశము లో లేకుండచేతును .

3

ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులు -నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే ; నీవికను బ్రదుక తగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలి దండ్రు లే వాని పొడుచుదురు.

4

ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు .

5

వాడు-నేను ప్రవక్తను కాను , బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును .

6

నీ చేతుల కు గాయము లేమని వారడుగగా వాడు-ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును .

మత్తయి 10:21

సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.

మత్తయి 10:22

మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షంపబడును.

మత్తయి 24:10

అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.