హేరోదియ
ఆదికాండము 39:17-20
17

అప్పుడామె తన భర్తతో ఈ మాటలచొప్పున చెప్పెను–నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.

18

నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెననెను

19

కాబట్టి అతని యజమానుడు–ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20

అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

1 రాజులు 21:20

అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.

పగపట్టి
ప్రసంగి 7:9

ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.

ఎఫెసీయులకు 4:26

కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.

ఎఫెసీయులకు 4:27

అపవాదికి చోటియ్యకుడి;