మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి [27 & 28 వచనాలు కలిపి ఉన్నాయి]
మత్తయి 27:38

మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.

లూకా 23:32

మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి ; వారు నేరము చేసినవారు .

లూకా 23:33

వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి .

యోహాను 19:18

అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.