వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను
మార్కు 1:45

అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి

మీకా 5:4

ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును . కాగా వారు నిలుతురు , ఆయన భూ మ్యంతముల వరకు ప్రబలుడగును ,

మత్తయి 4:24

ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 9:31

అయినను వారు వెళ్లి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.

లూకా 4:17

ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను ; ఆయన గ్రంథము విప్పగా --

లూకా 4:37

అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను .