వాటిని మేపుచున్నవారు పారి పోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి
మార్కు 5:14-16
14

ఆ పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.

15

జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయ పడిరి.

16

జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా

లూకా 8:34-36
34

మేపుచున్నవారు జరిగినదానిని చూచి , పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి .

35

జనులు జరిగినదానిని చూడవెళ్లి , యేసునొద్దకు వచ్చి , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని , స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి .

36

అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా

అపొస్తలుల కార్యములు 19:15-17
15

అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా

16

ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.

17

ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.