నీ దేహము నకు దీపము నీ కన్నే గనుక , నీ కన్ను తేటగా నుంటె నీ దేహ మంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.
కాబట్టి నీ లోనుండు వెలుగు చీకటియై యుండ కుండ చూచు కొనుము .
ఏ భాగమైనను చీకటి కాక నీ దేహ మంతయు వెలుగు మయమైతే , దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చు నప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.
దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.
దాసులారా , మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక , ప్రభువునకు భయపడుచు శుద్ధాంతః కరణగలవారై , శరీరము నుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.