
నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్న పానములు పుచ్చుకొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించి– ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.
ఆ దినములయందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.
మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయ లేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటి లోనికి రా లేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.