యోహాను చెరపట్టబడిన తరువాత యేసు
హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక
అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
అప్పుడు యేసు , ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను ; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను .
అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి , విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.
ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.
ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.