
మరియు–యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
–ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.
యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.
–నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా
పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.