తోలుకొని
మార్కు 11:4-8
4

వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,

5

అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

6

అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.

7

వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను.

8

అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.

లూకా 19:32-35
32

పంపబడిన వారు వెళ్లి , ఆయన తమతో చెప్పినట్టే కనుగొని

33

ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి .

34

అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి యున్నదనిరి .

35

తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి , ఆ గాడిదపిల్ల మీద తమ బట్టలు వేసి , యేసును దానిమీద ఎక్కించి ,

తమ బట్టలు వేయగా
2 రాజులు 9:13

అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజైయున్నాడని చాటించిరి.