ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు . సర్వ శరీరులు గడ్డియై యున్నారు వారి అంద మంతయు అడవి పువ్వువలె ఉన్నది
యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే .
గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును .
ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనిబోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.