ఉదయమందు
మార్కు 11:12

మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని

మార్కు 11:13

ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.

ఆయన ఆకలిగొనెను
మత్తయి 4:2

నలువది దినములు నలువదిరాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

మత్తయి 12:1

ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

లూకా 4:2

అపవాది చేత  శోధింపబడుచుండెను . ఆ దినముల లో ఆయన ఏమియు తిన లేదు . అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

హెబ్రీయులకు 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.