అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి
మత్తయి 4:24

ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

మత్తయి 4:25

గలిలయ, దెకపొలి, యెరూష లేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.

మార్కు 1:28-34
28

వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.

29

వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.

30

సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.

31

ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

32

సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి;

33

పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను.

34

ఆయన నానావిధ రోగములచేత పీడింప బడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.

మార్కు 2:1-12
1

కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను

2

ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

3

కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

4

చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.

5

యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.

6

శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.

7

వారుఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.

8

వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?

9

ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా?

10

అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి

11

పక్ష వాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.

12

తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

మార్కు 3:8-10
8

మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

9

జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.

10

ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడు చుండిరి.

మార్కు 6:55

ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.