అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
సంఖ్యాకాండము 1:8

ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

సంఖ్యాకాండము 1:28

ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:29

ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మందియైరి.

సంఖ్యాకాండము 7:18

రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.

సంఖ్యాకాండము 7:23

సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱ పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.

సంఖ్యాకాండము 10:15

ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.

సంఖ్యాకాండము 26:23-25
23

ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

24

వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.

25

జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;