షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమి్మదివేల మూడు వందలమంది యైరి.
సంఖ్యాకాండము 2:13

అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమి్మది వేల మూడు వందలమంది.

సంఖ్యాకాండము 25:8

సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.

సంఖ్యాకాండము 25:9

ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.

సంఖ్యాకాండము 25:14

చంపబడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.

సంఖ్యాకాండము 26:14

ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.