కూషీయులును
యెషయా 20:5
వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు,తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.
యిర్మీయా 46:9

గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

పూతువారును
ఆదికాండము 10:6

హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.

1దినవృత్తాంతములు 1:8

హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

యెహెజ్కేలు 27:10

పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయి లుగా ఉన్నారు , వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు , వారిచేత నీకు తేజస్సు కలిగెను .

యెహెజ్కేలు 30:5

కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

యెహెజ్కేలు 38:5

నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని , డాళ్లను శిరస్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసెదను.