అహరోను చేతులమీదను
నిర్గమకాండము 29:24-37
24

అహరోను చేతుల లోను అతని కుమారుల చేతుల లోను వాటినన్నిటిని ఉంచి , అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను .

25

తరువాత నీవు వారి చేతుల లోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను . అది యెహోవాకు హోమము .

26

మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను ; అది నీ వంత గును .

27

ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలు లో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను .

28

అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీ యుల నుండి అహరోనుకును అతని కుమారులకు నగును . అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలుల లోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును .

29

మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారుల వగును ; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.

30

అతని కుమారుల లో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను .

31

మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను .

32

అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను .

33

వారిని ప్రతిష్ఠచేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను ; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తిన కూడదు .

34

ప్రతిష్ఠితమైన మాంసము లోనేమి ఆ రొట్టెల లోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన యెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను ; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తిన వలదు .

35

నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను . ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను .

36

ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను . బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలినర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను .

37

ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను . ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును . ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును .

యిర్మీయా 30:21

వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.

హెబ్రీయులకు 9:14

నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

అల్లాడింపబడు
లేవీయకాండము 7:30

అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.

లేవీయకాండము 7:31

యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.