మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు
ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరు గకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి , అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి , నీ లోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి