బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు , దాని ప్రభావము పోయెనని ప్రజలును , సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు .
యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు , ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు ; అతని మాటలు దేశము సహింప జాలదు అని తెలియజేసెను.
రాజు మనకు లేడు , మనము యెహోవాకు భయ పడము , రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు .
షోమ్రోను నాశమగును , దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.