the rough
దానియేలు 8:5-7
5

నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి , కాళ్లు నేల మోప కుండ భూమి యందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను .

6

ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి , భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

7

నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని , మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను . ఆ పొట్టేలు దాని నెదిరింప లేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను ; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను .

దానియేలు 10:20

అతడు-నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతి తో యుద్ధముచేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును .

the great
దానియేలు 8:8

ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను ; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలు దిక్కులకు నాలుగు పెరిగెను ,

దానియేలు 11:3

అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును .