అతడు గెలుచునుగాని తన స్వబలమువలన గెలువడు ; ఆశ్చర్యముగా శత్రువులను నాశనముచేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను , అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును .
మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును ; అతడు రాజాధి రాజు తో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును .
అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును . మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.
అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి , పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై , తన యిష్టానుసారముగా జరిగించును . అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును .
జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు .
వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపుమాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని
నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్య కాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతు లలో కొందరు కూలుదురు .
ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు , ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధిపొందును ; అంతట నిర్ణయించినది జరుగును .
దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని , మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను . ఆ పొట్టేలు దాని నెదిరింప లేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను ; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను .
పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా , ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను . అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది ; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను .