శాకధాన్యాదులను
దానియేలు 1:16

రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి , వారికి శాకధాన్యాదుల నిచ్చెను .

ఆదికాండము 1:29

దేవుడు–ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీకాహారమగును.

ఆదికాండము 1:30

భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

ద్వితీయోపదేశకాండమ 8:3

ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.

రోమీయులకు 14:2

ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు , మరియొకడు బలహీనుడై యుండి, కూరగాయలనే తినుచున్నాడు .