కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును , మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును , నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి తరుముదును .
వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.
వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.
బయట ఖడ్గమును లోపట భయమును ¸యవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలుగలవారిని నశింపజేయును.
పొలములోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడుదురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమైయున్నారు.
మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.
యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.
యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.