గ్రామకంఠముగా
యెహెజ్కేలు 22:26

దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

యెహెజ్కేలు 42:20

నాలుగు తట్లు అతడు కొలిచెను ; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదు వందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.

యెహెజ్కేలు 44:23

ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితముకానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

యెహెజ్కేలు 45:6

మరియు పట్టణమునకై అయిదు వేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువది యైదు వేల కొలకఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయుల కందరికి అది స్వాస్థ్యముగా ఉండును .