ఇరువది యయిదు వేల
యెహెజ్కేలు 45:3

కొలువబడిన యీ స్థలము నుండి ఇరువది యైదు వేల కొలకఱ్ఱల నిడివియు పది వేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను . అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును .

ద్వితీయోపదేశకాండమ 12:19

నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ.

లూకా 10:7

వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరుగవద్దు.