ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున
వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.
వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశము లోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని , దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు , అర్పణలను అర్పించుచు , అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు , పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.
మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొనివచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
ఈ దేశమందు పరవాసివైయుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;
మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.
చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.