కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
ఐగుప్తు రాజైన ఫరో , నైలునది లో పండుకొనియున్న పెద్ద మొసలీ , నేను నీకు విరోధిని ; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే ;
దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా , నేను నీకు విరోధినైతిని , నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను .
మరియు నర పుత్రుడా , గోగును గూర్చి ప్రవచన మెత్తి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ , నేను నీకు విరోధినైయున్నాను .
నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి
నీ యెడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను , నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను ,
నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు , నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను .
నీవు పొలము మీద కూలుదువు , నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను , అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు .
నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక , నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను .
ఇదిగో అది వచ్చుచున్నది , కలుగబోవుచున్నది , నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి , కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు , వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును .
వారు పొలములో కట్టెలు ఏరు కొనకయు అడవులలో మ్రానులు నరు కకయునుండి , ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు , తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు , తమ సొమ్ము కొల్లపెట్టినవారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .