Wilt
యెహెజ్కేలు 12:9

నర పుత్రుడా , నీవు చేయున దేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము

యెహెజ్కేలు 17:12

తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.

యెహెజ్కేలు 20:49

అయ్యో ప్రభువా యెహోవా వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని.

యెహెజ్కేలు 24:19

నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా