అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని ; అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరమువలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను .
దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.
కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను.
కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను