నీ కోలలు వేయువారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలుచేయును .
అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయి లందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు .
వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.
ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,
నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులు లేని పట్టణములవలెనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతనకాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.
మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;
నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని , యిసుక రేణువులంత విస్తారముగా వెండిని , వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి .
యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును , అది అగ్నిచేత కాల్చబడును .