
ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు,
రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.
బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు.
బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.
దేశములోని జనులకీలాగు ప్రకటించుము యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు
నైలునదిని ఎండి పోజేసి నేనాదేశమును దుర్జను లకు అమ్మివేసెదను , పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను , యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను
ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు .
సకల జనులారా , ఆలకించుడి , భూమీ , నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు , పరిశుద్దా లయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.