
ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.
కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.
గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోష సమాప్తి కాలమున నీకు తీర్పువచ్చియున్నది.
ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుం డదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.
నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలు వదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు.
యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయు దురు.
అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు
అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?
నాదని చాటబడిన యీ మందిరము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.
నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక
నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.