
నీవు వీధి వీధిని గుళ్లు కట్టితివి, యెత్తయిన బలిపీఠములను ఏర్పరచితివి,
వారి చేతికి నిన్ను అప్పగించెదను,నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసికొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు.
ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.
నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమల మీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.
నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మి చ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.