యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా
యిర్మీయా 6:27

నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి యున్నాను.ఒ

యెహెజ్కేలు 8:6-18
6

అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు.

7

అప్పుడు ఆవరణద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను.

8

నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను.

9

నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా

10

నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను.

11

మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను.

12

అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా.

13

మరియు ఆయన నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి

14

యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని.

15

అప్పుడాయన నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి

16

యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.

17

అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగెముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు.

18

కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.

యెహెజ్కేలు 14:23

మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.