నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి యున్నాను.
యిర్మీయా 1:18

యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను.

యిర్మీయా 15:20

అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 3:8-10
8

ఇదిగో వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను , వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను .

9

నీ నుదురు చెకుముకి రాతి కంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను ; వారికి భయ పడకుము , వారందరు తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియ కుము .

10

మరియు నర పుత్రుడా , చెవి యొగ్గి నేను నీతో చెప్పు మాట లన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని

యెహెజ్కేలు 20:4

వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము.

యెహెజ్కేలు 22:2

నర పుత్రుడా , ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా ? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియ లన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.