ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.
నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.
యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.
దానియేలూ , నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్య కాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము . చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము .
ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును , సమాప్త మగుటకై ఆతురపడుచున్నది , అది తప్పక నెరవేరును , అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము , అది తప్పక జరుగును , జాగు చేయక వచ్చును.
నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని.
కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,