అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు,
మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని , కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు ? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే .