and he told
1 సమూయేలు 10:15

సౌలు పినతండ్రి -సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా

1 సమూయేలు 10:16

సౌలు -గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుప లేదు .

1 సమూయేలు 16:2-5
2

సమూయేలు -నేనెట్లు వెళ్లుదును ? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా -నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

3

యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము ; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ; ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా

4

సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను . ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి -సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

5

అతడు-సమాధానముగానే వచ్చితిని ; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి , యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.

2 రాజులు 6:19

అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు , ఇది పట్టణము కాదు , మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను .

అపొస్తలుల కార్యములు 23:6

అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.