సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు.
మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయుల నందరిని , విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును .
రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేము లో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనుని కి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని , వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధలలో కూర్చుందురు .
ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా -ఆ దినము లందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా ? యిదే యెహోవా వాక్కు .
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా -తూర్పు దేశములోనుండియు పడమటి దేశములోనుండియు నేను నా జనులను రప్పించి రక్షించి
యెరూషలేము లో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు , నేను వారికి దేవుడనై యుందును ; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.