అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరి వారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.
అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను యెహోవా సెలవిచ్చునదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను.
అన్యజనులేమి భూమిమీది యే జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీ రనుకొనుచున్నారే . మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు .
నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు , బాహు బలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.
మరియు నేను రౌద్రము కుమ్మరించుచు , బాహు బలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశము లలోనుండియు జనులలో నుండియు నేను మిమ్మును సమకూర్చి
జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి , అక్కడ ముఖా ముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను ; ఇదే యెహోవా వాక్కు.
అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.