నశింపజేసిన
యోబు గ్రంథము 3:10

అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని?

యోబు గ్రంథము 3:11

గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని?

యోబు గ్రంథము 3:16

అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయియుందును.వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయియుందును.

యోబు గ్రంథము 10:18

గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచియుండినయెడల మేలు;

యోబు గ్రంథము 10:19

అప్పుడు నేను లేనట్లేయుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

ప్రసంగి 6:3

ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను