
బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
నర పుత్రుడా , దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని , పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై , నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించుకొందురేమో
దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసికొనునట్లు వారు చూచుచుండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసికొనివచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువానివలె నీవు బయలుదేరవలెను
వారు చూచుచుండగా గోడకు కన్నమువేసి నీ సామగ్రిని తీసికొని దాని ద్వారా బయలుదేరుము
వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడ కుండ నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము , నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని .
ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను చేసితిని , ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నమువేసి వారు చూచుచుండగా సామగ్రిని తీసికొని మూట భుజము మీద పెట్టుకొంటిని
ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
నర పుత్రుడా , నీవు చేయున దేమని తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము
ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయుల కందరికిని చెందును
కాబట్టి వారికీమాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును , వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు
మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రియందు సామగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసికొని పోవుటకై తన సామగ్రిని బయటికి తెచ్చు కొనవలెనని గోడకు కన్నమువేసి నేల చూడ కుండ ముఖము కప్పుకొని పోవును
ఈ దేశము మీ విశ్రాంతి స్థలముకాదు ; మీరు లేచి వెళ్లిపోవుడి , మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి.
కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే–చదువువాడు గ్రహించుగాక–
యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,