నాశనము చేయు
యెషయా 10:33

చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.

యెషయా 10:34

ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.

యెషయా 9:18

భక్తిహీనత అగ్నివలె మండుచున్నది అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును.

2 రాజులు 19:23

నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి యున్నాను.

2 రాజులు 19:28

నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

యిర్మీయా 21:14

మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 20:47

దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.

యెహెజ్కేలు 20:48

అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును.