నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చు చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.
నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.
ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
ఎఫ్రాయిమూ , నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ? ఇశ్రాయేలూ , నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును ? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును ? నా మనస్సు మారినది , సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నది .
నా ఉగ్ర తాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవే ర్చను ; నేను మరల ఎఫ్రాయిమును లయ పరచను , నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను ,మిమ్మును దహించునంతగా నేను కోపింపను.
వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి , పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దుపెట్టుకొనెను .