leave
ప్రసంగి 8:3

రాజుల సముఖమునుండి అనాలోచనగా వెళ్లకుము; వారు తాము కోరినదెల్ల నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకుము.

for
1 సమూయేలు 25:24-44
24
నా యేలినవాడా , యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకించుము ;
25
నా యేలినవాడా , దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్ట వద్దు , అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు , మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడ లేదు .
26

నా యేలినవాడా , యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు . నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.

27

అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

28

నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము . నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును . నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును .

29

నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును ; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును .

30

యెహోవా నా యేలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మే లంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత

31

నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని , నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొనినందుకేగాని, మనో విచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.

32

అందుకు దావీదు -నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.

33

నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.

34

నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయిన యెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువ బడడన్న మాట నిశ్చయము అని చెప్పి

35

తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొని -నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని , సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను .

36

అబీగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా , రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి , త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

37

ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండె పగిలెను , అతడు రాతివలె బిగిసికొనిపోయెను .

38

పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను .

39

నాబాలు చనిపోయెనని దావీదు విని -యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి , నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను . తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను .

40

దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి -దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపె ననగా

41

ఆమె లేచి సాగిలపడి -నా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి

42

త్వరగా లేచి గార్దభము మీద ఎక్కి తన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతో కూడ దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను .

43

మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీయైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి .

44

సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.

సామెతలు 25:15

దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.