వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును
సామెతలు 31:24

ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును.

1 రాజులు 9:26-28
26

మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడలను కట్టించెను.

27

సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.

28

వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

2 దినవృత్తాంతములు 9:10

ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.

యెహెజ్కేలు 27:3-36
3

సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీ వనుకొనుచున్నావే;

4

నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు.

5

నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.

6

బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలు చేయుదురు, కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.

7

నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు

8

తూరుపట్టణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.

9

గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడ లన్నియు నీ రేవులలో ఉన్నవి.

10

పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయి లుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.

11

అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.

12

నానావిధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

13

గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారము చేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,

14

తోగర్మా వారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;

15

దదాను వారును నీతో వర్తకవ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

16

నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

17

మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారము చేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

18

దమస్కువారు హెల్బోను ద్రాక్షారసమును తెల్ల బొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.

19

దదానువారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.

20

దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.

21

అరబీయులును కేదారు అధిపతు లందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.

22

షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

23

హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.

24

వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

25

తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు.

26

నీ కోలలు వేయువారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలుచేయును.

27

అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయి లందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు.

28

నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;

29

కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి

30

నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలల మీద బుగ్గి పోసికొనుచు, బూడిదెలో పొర్లుచు

31

నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మన శ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.

32

వారు నిన్నుగూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రము లో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

33

సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూ పతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.

34

ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్స మూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

35

నిన్ను బట్టి ద్వీప నివాసు లందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును.

36

జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.