చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యముచేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.
బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు.