
అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చుకొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము.
వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండు కొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా