తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనుహెబ్రీ యుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచినన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.
నిర్గమకాండము 9:1

తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

నిర్గమకాండము 7:15

ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని

నిర్గమకాండము 8:20

కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.