నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను .
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను .